: క్యాన్సర్ బాధిత చిన్నారులను పరామర్శించిన సినీ హీరోలు
నేడు వరల్డ్ క్యాన్సర్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాదులోని ఎంఎన్ జే ఆసుపత్రి క్యాన్సర్ బాధిత చిన్నారుల్లో మానసిక స్థయిర్యాన్ని నింపే కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ హీరోలు మంచు విష్ణు, సునీల్, శివాజీ క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించారు. వారితో ఆప్యాయంగా ముచ్చటించి వారి మోముల్లో నవ్వులు పూయించారు. చిన్నారులకు కానుకలు అందజేశారు.