: కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో కేసీఆర్ భేటీ
కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని జైపాల్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీలో, పార్లమెంటు ఉభయసభల్లో తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇద్దరూ చర్చించనున్నారు. అలాగే వివిధ పార్టీల నేతలను కలిసిన కేసీఆర్ ఆ చర్చల సారాన్ని జైపాల్ రెడ్డికి వివరించనున్నారు. అన్నింటినీ చర్చించిన తరువాత పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు, కేంద్ర మంత్రులు అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించనున్నారని సమాచారం.