: నరేంద్ర మోడీ బీజేపీనే మించిపోయారు!: దిగ్విజయ్ సింగ్


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని మించిపోయారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. మోడీ వ్యక్తిత్వం సొంత పార్టీని, ఆర్ఎస్ఎస్ ను మించిపోయిందని దిగ్విజయ్ అన్నారు. అయితే, దిగ్విజయ్ సింగ్ మోడీని పొగుడుతున్నారనుకునేరు.. కానే కాదు, ఆయన మోడీపై వ్యంగ్యంగా అన్న మాటలివి.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన డిగ్గీరాజా మీడియాతో మాట్లాడుతూ, నరేంద్ర మోడీని 'కరడు గట్టిన మతతత్వ సిద్ధాంతాలు గల రాజకీయ నాయకుని'గా అభివర్ణించారు. గుజరాత్ ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న పేదవారి దినసరి ఆదాయం 10 రూపాయల 80 పైసలుగా నిర్ణయించడాన్ని డిగ్గీరాజా తప్పుపట్టారు. ఇంతకు మునుపే కేంద్ర ప్రణాళికా సంఘం పేదవారి తలసరి ఆదాయాన్ని ఖరారు చేసినప్పుడు వ్యతిరేకించిన బీజేపీ, మరి ఇప్పుడు ఆ గుజరాత్ ప్రభుత్వం అంతే దినసరి ఆదాయాన్ని ఎలా నిర్ణయించిందని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News