: ఆ ముగ్గురు= కోహ్లీ


భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీపై ఇంటా బయటా ప్రశంసల వర్షం కురుస్తోంది. సొంతగడ్డపైనే కాకుండా విదేశీ పిచ్ లపైనా పరుగుల వర్షం కురిపిస్తున్న కోహ్లీని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో కొనియాడాడు. బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్, ద్రావిడ్, సెహ్వాగ్ ముగ్గురి కలయికే కోహ్లీ అని క్రో అభివర్ణించాడు. ప్రస్తుతం పునర్నిర్మాణ దశలో ఉన్న టీమిండియా జట్టులో కోహ్లీ శిఖరాగ్రం లాంటి వాడని పేర్కొన్నాడు. త్వరగా నేర్చుకునే స్వభావం ఉన్న ఈ యువ ఆటగాడు స్ఫూర్తిదాయకమైన నాయకుడని, అభిమానులకు ఆదర్శప్రాయుడని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి కోహ్లీని పరిశీలిస్తున్నానని, అప్పట్లో చెత్త షాట్లకు పోయి అవుటయ్యేవాడని.. కానీ, ఇప్పుడు ఎంతో పరిణతి సాధించాడని ప్రశంసించాడు.

  • Loading...

More Telugu News