: డీఎంకే వెళ్లినా మెజారిటీలోనే యూపీఏ సర్కారు


కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగుతున్నట్లు, పూర్తిగా తెగతెంపులు చేసుకుంటున్నట్లు డీఎంకే ప్రకటించింది. మరి డీఎంకే నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనా? ఏం కాదు. డీఎంకే వెళ్లిపోయినా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు. ఎందుకంటే ప్రస్తుతం లోక్ సభలో 539 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే మెజారిటీ మార్కు 270 స్థానాలు.

 డీఎంకేకు చెందిన 18 మంది ఎంపీలు దూరం కావడం వల్ల యూపీఏ బలం 232కు పడిపోతుంది. యూపీఏకి 49 మంది సభ్యుల బలం అదనంగా ఉంది. 22 మంది ఎంపీలున్న ఎస్పీ, 21 మంది ఎంపీలున్న బీఎస్పీ, మూడు ఎంపీలున్న జేడీఎస్, ఆర్జేడీ బయట నుంచి యూపీఏకు మద్దతు తెలుపుతున్నాయి.

 దీంతో యూపీఏ సర్కారు బలం 281గా ఉంటుంది. ఇది మెజారిటీ కంటే ఎక్కువే. బీఎస్పీ అధినేత్రిపై సీబీఐ కేసులు ఉన్నందున ఆ పార్టీ యూపీఏకు మద్దతు ఉపసంహరించుకునే అవకాశం లేదు. ఇక ఎస్పీ కూడా పలు మార్లు యూపీఏను గండం నుంచి గట్టెక్కించింది. అందుకే ములాయంసింగ్ యాదవ్ ను కాంగ్రెస్ ఆపద్బాంధవుడిగా  భావిస్తుంది. 

  • Loading...

More Telugu News