: ఆధునిక పరిజ్ఞానంతో బీజేపీ ఎన్నికల ప్రచారం: సుస్మాస్వరాజ్


ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని బీజేపీ సీనియర్ నేత సుస్మాస్వరాజ్ చెప్పారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుష్మ మాట్లాడుతూ, సోషల్ మీడియా, డీటీహెచ్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ద్వారా ఎన్నికల ప్రచారం చేస్తామన్నారు. కాగా, 'ఛాయ్ పై చర్చ' ప్రచార కార్యక్రమాన్ని ఈ నెల 12న మోడీ ప్రారంభిస్తారన్నారు. దేశ వ్యాప్తంగా మూడు వందల నగరాలు, పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని, దీని ద్వారా ఐదు కోట్ల మందిని చేరుకుంటామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News