: ముగిసిన జీవోఎం భేటీ
తెలంగాణ అంశంపై కేంద్ర మంత్రుల బృందం సమావేశం ముగిసింది. పార్లమెంటు నార్త్ బ్లాక్ లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ బిల్లులో కొన్ని సవరణలకు ఆమోదం తెలిపారు. అనంతరం బిల్లును ఖరారు చేస్తూ క్యాబినెట్ నోట్ ను రూపొందించారు. ఈ నెల 7న జరిగే క్యాబినెట్ భేటీలో బిల్లుపై చర్చించాలని జీవోఎం సిఫార్సు చేసింది. కాగా, భేటీ అనంతరం హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ, ఇదే జీవోఎం చివరి సమావేశమని స్పష్టం చేశారు.