: రేపు అర్ధరాత్రి నుంచి సమ్మె: అశోక్ బాబు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏపీఎన్జీవోలు మరోసారి సమ్మెబాట పడుతున్నారు. రేపు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఈ రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కార్యాలయంలో సమ్మె నోటీసు ఇచ్చారు. రేపు సీఎస్ ను వ్యక్తిగతంగా కలసి మరోసారి నోటీసు ఇస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. సమైక్య పరిరక్షణ వేదిక తరఫున నోటీసిచ్చామని చెప్పారు. సమ్మె సందర్భంగా జాతీయ రహదారుల దిగ్బంధం, రైల్ రోకో లాంటి కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పారు. అవసరమైతే ఎన్నికల విధులను కూడా బహిష్కరిస్తామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనే అంశంపై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.