: ఎలాగైతేనేం.. ‘జై హో’ సినిమా 100 కోట్లు వసూలు చేసేసింది!


సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘జై హో’ భారీ అంచనాలతో విడుదలైన విషయం తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చతికిలపడింది. గతంలో సల్మాన్ చిత్రాలన్నీ విడుదలైన తొలివారంలోనే అదిరిపోయే కలెక్షన్లతో రికార్డులకెక్కాయి. గతంలో విడుదలైన దబాంగ్-2, ఏక్ థా టైగర్ సినిమాలైతే కేవలం ఆరు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాయి. ధూమ్ 3 అయితే మూడు రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది.

ఇప్పుడు ‘జై హో’ మాత్రం పది రోజుల్లో వంద కోట్లను వసూలు చేసి.. ఎట్టకేలకు వంద కోట్ల క్లబ్ లో చోటు దక్కించుకుంది. ఇప్పటి వరకు ‘జై హో’ 101 కోట్ల 25 లక్షలు వసూలు చేసింది. తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టాలిన్’ సినిమా ఆధారంగా రూపొందిన ‘జై హో’కి ప్రేక్షకుల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రాలేదని బాలీవుడ్ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

  • Loading...

More Telugu News