: 'సచిన్ వెరీ కూల్' అంటున్న గోల్ఫ్ 'టైగర్'


భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ను విఖ్యాత గోల్ఫర్ టైగర్ వుడ్స్ ప్రశంసల్లో ముంచెత్తాడు. ఢిల్లీలో సచిన్ ను కలిసిన వుడ్స్ అనంతరం ట్విట్టర్లో స్పందిస్తూ, 'బ్యాటింగ్ దిగ్గజం కుటుంబాన్ని కలిశాను. సచిన్ చాలా కూల్' అని పేర్కొన్నాడు. ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ (డీజీసీ)లో ఓ ప్రైవేటు మ్యాచ్ కోసం వుడ్స్ భారత్ విచ్చేశాడు. మరోవైపు సచిన్ 'భారతరత్న' అందుకునేందుకు ఢిల్లీలోనే ఉండడంతో ఈ విశ్వక్రీడా దిగ్గజాల కలయిక సాధ్యమైంది.

  • Loading...

More Telugu News