: కేంద్ర మంత్రి జైరాం రమేష్ కు టీడీపీ సెగ
కేంద్ర మంత్రి జైరాం రమేష్ కు టీడీపీ సమైక్యాంధ్ర సెగ తగిలింది. ఢిల్లీలో కాసేపట్లో జరగనున్న జీవోఎం సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రి జైరాం రమేష్ ను టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడ్డుకున్నారు. జైసమైక్యాంధ్ర అంటూ అటకాయించారు. దీంతో టీడీపీ ప్రజా ప్రతినిధులను భద్రతా సిబ్బంది ప్రక్కకు తప్పించి మంత్రిని అక్కడ నుంచి వెళ్లేలా చేశారు.