: రిటైరైనా క్రికెట్ ఆడతా: సచిన్
రిటైరైనా.. భారతీయుల చిరునవ్వు కోసం మళ్లీ బ్యాట్ పడతానని విఖ్యాత క్రికెటర్ సచిన్ టెండుల్కర్ అన్నారు. 'రిటైరైనా దేశం కోసం బ్యాట్ పడతా. దేశ ప్రజల ఆనందం కోసం నా శక్తిమేర పాటు పడతా' అని చెప్పారు. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును రాష్ట్రపతి నుంచి స్వీకరించిన అనంతరం సచిన్ మాట్లాడారు. ఇది తనకు అత్యున్నత గౌరవమని, ఈ దేశంలో పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. ఈ అవార్డును తన తల్లితోపాటు.. తమ పిల్లల స్వప్నాల కోసం త్యాగాలు చేసిన అమ్మలందరికీ అంకితం చేస్తున్నట్లు సచిన్ ప్రకటించారు. సచిన్ గతేడాది నవంబర్ 16న క్రికెట్ కు పూర్తిగా సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. సచిన్ తో పాటు శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు కూడా భారతరత్నను అందుకున్నారు.