: లంకలో హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు: సోనియా
ఈ ఉదయం జరిగిన పార్టీ పార్లమెంటరీ భేటీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శ్రీలంక అరాచాకాలపై స్పందించారు. లంకలో తమిళుల ఊచకోతను ఖండించారు. శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘనలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించేందుకు అన్ని చర్యలు చేపట్టబోతున్నామని తెలిపారు.
ఇక 2014లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉండాలని సోనియా పిలుపునిచ్చారు. ఈ భేటికి మంత్రి బేణీ ప్రసాద్ వర్మ హాజరుకాకపోవడం గమనార్హం. ఆయన బీజేపీలో చేరతారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.