: సీఎంతో సీమాంధ్ర ప్రాంత నేతల భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే అనుసరించాల్సిన వ్యూహంపై వీరు చర్చిస్తున్నారు. అలాగే సాయంత్రం అధిష్ఠానంతో జరుగనున్న ఎంపీల సమావేశంపై కూడా వారు చర్చిస్తున్నారు. రేపు శక్తిస్థల్ వద్ద చేపట్టనున్న దీక్షపై కూడా చర్చిస్తున్నారు.