: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతాం: జేసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అధిష్ఠానంతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రెండు లేక మూడు రోజులు ఢిల్లీలో ఉండి విభజన అడ్డుకునే ప్రయత్నాలు కలసికట్టుగా చేస్తామని అన్నారు. శాసనసభ, శాసనమండలిలో ఓడిపోయిన బిల్లును ఏ ప్రాతిపదికన ఆమోదిస్తారని అధిష్ఠానాన్ని ఆయన ప్రశ్నించారు.