: పిల్లి కాలు విరగ్గొట్టినందుకు రెండేళ్ల జైలు శిక్ష.. 25లక్షల జరిమానా
వెర్రి ముదిరితే ఏమవుతుంది..? ఇలానే ఉంటుంది. ఫ్రాన్స్ లోని మార్సెల్లీ పట్ణణానికి చెందిన ఒక యువకుడు తన పెంపుడు పిల్లిని గాల్లోకి విసిరేశాడు.. ఒక ఫోటో తీసుకున్నాడు. సంతోషంతో తీసుకెళ్లి ఫేస్ బుక్ లో పెట్టేశాడు. అలా ఎగరేసిన తర్వాత పిల్లి కిందపడడంతో దాని కాలు విరిగింది. ఆ యువకుడిపై దేశ జంతుసంరక్షణ సంస్థ కేసు పెట్టింది. కోర్టు రెండేళ్ల జైలు శిక్ష.. 25లక్షల జరిమానా విధించింది. మన దేశంలో జంతువులను చంపినా.. శిక్ష పడే దాఖలాలు తక్కువే.