: రాష్ట్ర సమైక్యతకు కట్టుబడి ఉన్నాం..న్యాయపోరాటమైనా చేస్తాం: గంటా


సీమాంధ్ర నేతలంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కాసేపట్లో సీమాంధ్ర నేతలంతా సమావేశం కానున్నామని అన్నారు. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఇందిరాగాంధీ స్మారక చిహ్నం శక్తిస్థల్ వద్ద దీక్ష చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అధిష్ఠానం తెలంగాణ బిల్లును ముందుకు తీసుకెళ్లకుండా ఆపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని గంటా తెలిపారు. రాష్ట్రంలో ఉభయసభలు తిరస్కరించి పంపిన బిల్లును ఎలా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు. అలా ఆమోదించేటట్టైతే బిల్లును రాష్ట్రానికి పంపాల్సిన అవసరం లేదు కదా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు న్యాయ పోరాటంతో పాటు, రాజకీయ లాబీయింగ్ కు కూడా తాము వెనుకాడమని గంటా తెలిపారు.

  • Loading...

More Telugu News