: పది, పన్నెండు రోజులు బిల్లును అడ్డుకోగలిగితే చాలంటున్న సబ్బం
పార్లమెంటులో రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లును పది, పన్నెండు రోజుల పాటు సమర్థంగా అడ్డుకోగలిగితే చాలని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి అంటున్నారు. అందుకు సీమాంధ్ర ఎంపీలతోపాటు సీమాంధ్ర మంత్రులూ కలసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఓ చానల్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఫ్లోర్ మేనేజ్ మెంట్ లో కాంగ్రెస్ కు ఎవరూ సాటిరారని చెప్పుకొచ్చారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో చర్చకు రాదని.. ఎలాగోలా వచ్చినా అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం అప్రజాస్వామిక రీతిలో బిల్లు ప్రవేశపెడితే తామూ అదే పద్ధతిలో ఎదుర్కొంటామని తెలిపారు. తాము కాంగ్రెస్ కు వ్యతిరేకం కాదని, ప్రజాభిప్రాయానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నామని సమర్థించుకున్నారు.