: రూ. 15వేలకు పడిపోయిన శాంసంగ్ స్మార్ట్ వాచ్ ధర


శాంసంగ్ స్మార్ట్ వాచ్ ధర ఇప్పుడు రూ. 15,290 మాత్రమే. గతేడాది ఎంతో ఘనంగా విడుదల చేసిన దీని ధర అప్పట్లో రూ. 22,290. అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో శాంసంగ్ కంపెనీ జనవరిలో ధరను రూ. 19వేలకు తగ్గించింది. ఇప్పుడు మరికాస్త తగ్గింది. ఇందులో 1.9మెగా పిక్సల్ కెమెరా, 512ఎంబీ ర్యామ్, 4జీబీ మొమరీ, 1.6అంగుళాల స్క్రీన్ తదితర సదుపాయాలు ఉన్నాయి. ఎస్3, ఎస్4, ఎస్4 మినీ, నోట్2, నోట్3 మొదలైన వాటితో ఈ స్మార్ట్ వాచ్ ను అనుసంధానించుకోవచ్చు.

  • Loading...

More Telugu News