: రాజీవ్ హంతకులపై దయ చూపొద్దు: సుప్రీంలో కేంద్రం వాదన


దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ముద్దాయిలపై కనికరం చూపరాదని కేంద్రం నేడు సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపించింది. తమ క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో ఎంతో సమయం వృథా అయిన నేపథ్యంలో తమ మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని శాంతన్, మురుగన్, పెరారివలన్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం నేడు విచారణ చేపట్టింది. కేంద్రం తరుపున అటార్నీ జనరల్ గులామ్ వాహనవతి వాదించారు. క్షమాభిక్ష పిటిషన్ల పరిశీలన సమయంలో ముగ్గురు నిందితులను శారీరక హింసకు గురి చేయడం కానీ, అమానవీయ పద్ధతుల్లో వేధించడం కానీ జరగలేదని వాహనవతి కోర్టుకు తెలిపారు. ముద్దాయిలు తమ క్షమాభిక్ష పిటిషన్లలో పేర్కొన్నట్టుగా 'దయ' అన్న పదానికి తావుండరాదని ఆయన వాదించారు.

  • Loading...

More Telugu News