: బీజేపీ అగ్రనేత అద్వానీతో చంద్రబాబు భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో బిజిబిజీగా ఉన్నారు. నిమిషం తీరిక లేకుండా పలువురు జాతీయ నేతలను కలుస్తూ రాష్ట్ర సమస్యకు మద్దతును కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ అగ్రనేత అద్వానీతో పార్టీ బృందంతో కలసి బాబు భేటీ అయ్యారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సీపీఐ నేత బర్దన్, సాయంత్రం 4 గంటలకు సుష్మాస్వరాజ్ తో బాబు భేటీ కానున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్, ప్రకాశ్ కారత్ లతో భేటీ అవుతారని సమాచారం. అంతేగాక కాంగ్రెస్సేతర పార్టీలను కలవాలని, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడులో పర్యటించి రాష్ట్ర పరిణామాలు వివరించాలని బాబు నిర్ణయించారు.