: ఆ స్కూల్లో ఒకటే క్లాసు!


స్కూలంటే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంటుందని తెలిసిందే. కానీ, ఈ స్కూలు గురించి వింటే ఆశ్చర్యపోకతప్పదు. ఎందుకంటే, ఇక్కడ కేవలం ఒక్క క్లాసు మాత్రమే ఉంటుంది. అదీ టెన్త్ క్లాస్ మాత్రమే. అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు కామెంగ్ జిల్లాలో ఈ స్కూలు ఉంది. 2009లో కేంద్ర ప్రభుత్వం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ పథకం కింద ఏర్పాటు చేసిన ఈ స్కూల్లో అప్పట్లో 54 మంది విద్యార్థులు ఆరవ తరగతిలో చేరారు. ఆ తర్వాత మరెవ్వరూ ఆ స్కూల్లో చేరలేదు. వారందరూ ఇప్పుడు టెన్త్ క్లాస్ కు వచ్చారు.

ఈ నాలుగేళ్ళలో కొత్తవాళ్ళెవరూ చేరకపోగా, ఓ విద్యార్థి మానేశాడు. వచ్చే ఏడాది ఈ స్కూలు భవిష్యత్తేంటో తేలనుంది. ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాసి బయటికెళ్లిపోతే, విద్యార్థులెవరూ లేక స్కూల్ బోసిపోక తప్పదు. 2009లో కేంద్ర గిరిజన శాఖ దేశవ్యాప్తంగా 100 మోడల్ స్కూళ్ళు తెరవగా వాటిలో అరుణాచల్ ప్రదేశ్ కు రెండు మంజూరయ్యాయి. ఈ రెండింటిలో ఒకదాని పరిస్థితి ఇప్పుడు ఇలా తయారైంది.

  • Loading...

More Telugu News