: తిరుపతిలో విద్యార్థి దారుణ హత్య
తిరుపతిలో ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహం ఆర్టీసీ బస్టాండ్ వద్ద పడి ఉండగా గుర్తించిన పోలీసులు కుటుంబీకులకు సమాచారం అందించారు. హత్యకు గురైన విద్యార్థి స్థానిక సాయినగర్ కు చెందిన నందకిశోర్ అని తెలుస్తోంది. గతరాత్రి నందకిశోర్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, మృతదేహం పడి ఉన్న చోటే అతని పుస్తకాలు, బ్యాగ్ లభ్యమయ్యాయి. డబ్బు కోసం చంపారా? లేక మరేదైనా కారణమా? అన్నది తెలియాల్సి ఉంది.