: మోడీకి ఓటేయమని నా అనుచరులను కోరతా: బాబా రాందేవ్
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా మారిన యోగా గురువు బాబా రాందేవ్ అవకాశం వచ్చినప్పుడల్లా నరేంద్ర మోడీకి తన మద్దతు తెలుపుతున్నారు. ఈ మేరకు అహ్మదాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీకి ఓటు వేయమని తన అనుచర గణాన్ని విజ్ఞప్తి చేస్తానని చెబుతున్నారు. అంతేకాక, తన పతంజలి యోగా పీఠ్ ట్రస్టు ద్వారా ఓ ప్రణాళిక ప్రకారం దేశ వ్యాప్తంగా 50 కోట్ల ఓటర్లను పోగు చేస్తామన్నారు. దాంతో, బీజేపీ 300 సీట్లు గెల్చుకుంటుందని చెప్పారు. ఇందుకోసం మార్చి 1 నుంచి తమ పని ప్రారంభించనున్నట్లు తెలిపారు.