: బస్సు లోయలో పడి పదిమంది దుర్మరణం


మహారాష్ట్రలోని సతారా జిల్లా ఖండాలా వద్ద ఓ లగ్జరీ బస్సు లోయలోకి జారిన దుర్ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. 30 మంది గాయపడ్డారు. గుజరాత్ నుంచి యాత్రికులను తీసుకువస్తున్న ఈ బస్సు గతరాత్రి రహదారిపై మలుపు వద్ద ఓ కంటైనర్ వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను ఖండాలా ఆసుపత్రికి తరలించారు. కాగా, గత నెలలో ఇదే మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది అసువులు బాశారు.

  • Loading...

More Telugu News