: ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమ (ఫేకర్) లాకౌట్
రాష్ట్రంలో మరో పరిశ్రమ లాకౌట్ ప్రకటించింది. విజయనగరం జిల్లా గరివిడిలో ఉన్న ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమ (ఫేకర్) లాకౌట్ ప్రకటించినట్టు ఆ పరిశ్రమ జనరల్ మేనేజర్ కేవీఎస్ఎస్ఎన్ మూర్తి ప్రకటించారు. ఈ ఉదయం నుంచి లాకౌట్ అమల్లోకి వస్తుందని తెలిపారు. సంస్థలో వ్యాగన్ లోడింగ్, అన్ లోడింగ్ కార్మికులు పనులు స్తంభింపచేయడం వల్ల పరిశ్రమను నిర్వహించడం సాధ్యం కావడం లేదని చెప్పారు. ప్రస్తుతం ఈ పరిశ్రమపై ఆధారపడి 1400 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.