: నేడు 'భారతరత్న' అవార్డ్ అందుకోనున్న సచిన్, సీఎన్ఆర్ రావు
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సచిన్, సీఎన్ఆర్ రావు 'భారతరత్న' అవార్డును అందుకుంటారు. 24 ఏళ్లపాటు క్రికెటర్ గా ఎనలేని సేవలందించి... భారతదేశ పేరుప్రఖ్యాతులను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు... ప్రముఖ శాస్త్రవేత్త, ప్రధాని సాంకేతిక సలహాదారు ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు భారత ప్రభుత్వం గత సంవత్సరం నవంబర్ 16 న 'భారతరత్న'ను ప్రకటించిన సంగతి తెలిసిందే.