: రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరుతూ వివిధ జాతీయ పార్టీల నేతలను కలుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ బిల్లు తయారు విషయంలో కేంద్రం విస్మరించిన అంశాలు, సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర శాసనసభపై కేంద్రానికి ఉన్న అభిప్రాయం వంటి అంశాలపై రాష్ట్రపతికి ఆయన ఫిర్యాదు చేయనున్నారు. విభజన బిల్లుపై శాసనసభ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను చంద్రబాబు రాష్ట్రపతికి వివరించనున్నారు.