: 9999 నెంబరు విలువ అక్షరాలా రూ. 3,35,000
అది మొబైల్స్ కి కావచ్చు, వాహనాలకు కావొచ్చు, ఫ్యాన్సీ నెంబర్ల మోజేవేరు అని మరోమారు రూఢీ అయింది. తాజాగా కృష్ణా జిల్లా వాహనాల రిజిస్టేషన్స్ లో నిన్నటికి పాత (సీఎఫ్) సీరిస్ ముగిసి, కొత్తగా (సీహెచ్) సీరిస్ ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఫ్యాన్సీ నెంబర్లకు వేలంపాట నిర్వహించారు.
ఇందులో ఏపీ 16 సీహెచ్ 9999 నెంబరుకు అధికారికంగా రూ. 50వేల ధర నిర్ణయించగా, ఆ నెంబరు వేలంలో రూ. 3,35,100 ధర పలికింది. ఇంకా, ఏపీ 16 సీహెచ్ 0001 నెంబరుకు రూ. 50వేలు, ఏపీ 16 సీహెచ్ 0002 నెంబరుకి రూ. 32వేలు, కొత్త సీరిస్ 14వ నెంబరుకు రూ. 15,600, 23కు 14,900, 4 వ నెంబరుకు రూ. 12వేలు ధర పలికాయి.
ఇలా వివిధ నెంబర్ల వేలం ద్వారా తమ శాఖకు మొత్తంగా రూ. 5,73,989 రాబడి వచ్చిందని జిల్లా డెప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఎ. మోహన్ వెల్లడించారు.
- Loading...
More Telugu News
- Loading...