: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిచ్చుపెట్టింది: చంద్రబాబు నాయుడు


పచ్చగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చిచ్చుపెట్టిందని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం రెండుగా చీలిపోయిందని అన్నారు. అధికార పార్టీ ఎంపీలు, మంత్రులు ఒక్కటిగా దేశ రాజధానికి రాలేని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీగా తాము ఇరు ప్రాంతాల నేతలతో కలసి ఢిల్లీకి రాగలిగామని బాబు తెలిపారు.

రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని తాము కోరుతున్నామని, అంతా అయిపోయిందని తెలిపిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతలను సమావేశానికి రమ్మని పిలుస్తూ కొత్త నాటకానికి తెరతీసిందని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీలను పిలిచి మాట్లాడి, రేపు తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెడితే ఉపయోగం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందని బాబు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News