: సమైక్యాంధ్ర కోసం.. మళ్లీ సమ్మె సైరన్ మోగించిన ఏపీఎన్జీవోలు


సమైక్యాంధ్ర సాధనే తమ లక్ష్యమని మరోమారు ఏపీఎన్జీవోలు పునరుద్ఘాటించారు. అందుకోసం వారు సమ్మె బాట పడుతున్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏపీఎన్జీవో భవన్లో సోమవారం సాయంత్రం సమావేశమైన ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 6వ తేదీ, గురువారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు వారు తెలిపారు. ఈ సమ్మె పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకూ కొనసాగించనున్నట్లు వారు వెల్లడించారు. 7, 8, 9 తేదీల్లో పార్లమెంటు సభ్యుల నివాసాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనలు చేయనున్నట్లు వారు చెప్పారు. 10, 11, 12 తేదీల్లో రాష్ట్ర బంద్ కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. 17, 18, 19 తేదీల్లో ఛల్లీ ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రకటించింది.

  • Loading...

More Telugu News