: సమ్మె బాట పట్టిన జార్ఖండ్ ఖైదీలు
జార్ఖండ్ లోని పలు జైళ్ళలో మగ్గుతున్న ఖైదీలు సమ్మె బాట పట్టారు. తమ శిక్షాకాలం పూర్తయినా విడుదల చేయడంలేదని వెయ్యి మందికి పైగా ఖైదీలు నేడు ఆందోళనకు దిగారు. జయప్రకాశ్ నారాయణ్ కేంద్ర కారాగారంలో 700, గార్వా జైల్లో 200, మేదినీ నగర్ జైల్లో 140 మంది నిరశన దీక్షకు ఉపక్రమించారు. ఈ విషయంపై ఇన్ స్పెక్టర్ జనరల్ శైలేంద్ర భూషణ్ స్పందించారు. ఖైదీల విడుదలపై సీఎం అధ్యక్షతన కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.