: స్టేట్ బ్యాంక్ చోరీ కేసులో కీలక ఆధారాలు దొరికాయి


కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరీ కేసు దర్యాప్తులో పురోగతి కనిపించింది. చోరీ ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయని కరీంనగర్ ఎస్పీ శివకుమార్ తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్ ను ఎస్పీ మీడియాకు విడుదల చేశారు. ఇది నార్త్ ఇండియాకు చెందిన ప్రొఫెషనల్ గ్యాంగ్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ఏడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు. సీసీ ఫుటేజ్ లో ఉన్న అనుమానితుల వివరాలను తెలియజేయాలని ఆయన పట్టణ ప్రజలను కోరారు. తమకు సమాచారం అందించిన వారి పేర్లను, వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ చెప్పారు.

చొప్పదండి స్టేట్ బ్యాంక్ శాఖలోకి శనివారం ఉదయం కొందరు ఆగంతుకులు ప్రవేశించి బ్యాంకు సిబ్బందిని తుపాకులతో బెదిరించి 40 లక్షల రూపాయల సొమ్మును ఎత్తుకెళ్లిన విషయం విదితమే. వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును మొదలుపెట్టారు. బ్యాంకులోని సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించి, దొంగలను గుర్తించి.. వారి కోసం వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

  • Loading...

More Telugu News