: రష్యాలో విద్యార్థి ఘాతుకం
రష్యా రాజధాని మాస్కోలో ఓ విద్యార్థి తుపాకీతో స్కూల్లో ప్రవేశించడమే కాకుండా ఇద్దరిని పొట్టనబెట్టుకున్నాడు. నేడు జరిగిన ఈ సంఘటన వివరాల్లోకెళితే.. ఓ విద్యార్థి తాను చదివిన పాఠశాలకు తుపాకీతో వెళ్ళాడు. గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది నిలువరించినా ఆగకుండా, టెన్త్ క్లాస్ రూమ్ లోకి వెళ్లి అక్కడ 20 మంది విద్యార్థులను బందీలుగా పట్టుకున్నాడు. ఈలోగా స్కూలు సెక్యూరిటీ సిబ్బంది అలారమ్ మోగించి అందరినీ అప్రమత్తం చేశారు. కాగా, సాయుధుడైన ఆ విద్యార్థి ఓ టీచర్ ను కాల్చిచంపడమే కాకుండా, తనను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులపైనా కాల్పులు జరిపాడు. దీంతో, ఓ పోలీస్ అధికారి కూడా బలయ్యాడు. అనంతరం పోలీసులు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకుని, బందీలుగా ఉన్న విద్యార్థులను విడిపించారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.