: ఓ మెట్టు దిగజారిన కోహ్లీ
టి20 ర్యాంకింగ్స్ లో టీమిండియా బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఓ స్థానం దిగజారాడు. ఐసీసీ నేడు ప్రకటించిన టి20 బ్యాటింగ్ విభాగం ర్యాంకుల్లో కోహ్లీ నాలుగోస్థానంలో నిలిచాడు. రైనా, యువరాజ్ సింగ్ తమ ర్యాంకులు మెరుగుపరుచుకుని 5, 6 స్థానాలు దక్కించుకున్నారు. ఇక బౌలింగ్ జాబితాలో ఒక్క భారత బౌలర్ కూ చోటు దక్కలేదు. యువరాజ్ సింగ్ ఆల్ రౌండర్ల జాబితాలో తన మూడవ ర్యాంకును పదిలపరుచుకున్నాడు.