: అవినీతి బిల్లులు ఆమోదం పొందాలి..సహకరించండి: కమల్ నాథ్
తెలంగాణ బిల్లు, ఆరు అవినీతి నిరోధక బిల్లులతో బాటు, లోక్ సభ ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్ లో ఉన్న కొన్ని బిల్లులను ఆమోదించాల్సి ఉందని కేంద్ర మంత్రి కమల్ నాథ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ మొత్తం పది బిల్లులను ఆమోదించాల్సిన అవసరం ఉన్నందున ప్రతిపక్షాలు సహకరించాలని అఖిలపక్షం సమావేశంలో కోరామని తెలిపారు. లోక్ పాల్ బిల్లు, భూ పంపిణీ, ఆహార భద్రత బిల్లును ఆమోదించామని, రానున్న సమావేశాల్లో తెలంగాణ బిల్లు, మహిళా భద్రతా బిల్లులను ఆమోదించాలని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుపై అన్ని రాజకీయ పార్టీలు డబుల్ గేమ్ ఆడుతున్నాయని ఆయన మండిపడ్డారు. లోక్ సభ, రాజ్యసభలో తెలంగాణ బిల్లును గెలిపించి అక్కడి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. తెలంగాణ బిల్లుపై రాజకీయాలు చేయడం మానేయాలని ఆయన సూచించారు.