: బోరబండ కార్పొరేషన్ స్థానం ఎంఐఎం వశం
బోరబండ కార్పొరేషన్ స్థానం ఎంఐఎం ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి భానుమతి 1283 ఓట్ల మెజారిటీతో కార్పొరేటర్ గా విజయం సాధించారు. ఈమెకు 5241 ఓట్లు లభించాయి. 3958 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి సుల్తానా రెండో స్థానంలో నిలవగా, 2655 ఓట్లతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్య కవిత మూడో స్థానంలో నిలిచారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
గతంలో ఈ స్థానానికి కార్పొరేటర్ గా కాంగ్రెస్ అభ్యర్థి వనజ గెలిచారు. అయితే ఆమె ఇద్దరు సంతానం నిబంధనను ఉల్లంఘించినందున ఉపఎన్నికలకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కారణంగా గత ఆదివారం 17న ఉప ఎన్నికలు జరగ్గా ఆ స్థానం ఎంఐఎం సొంతం చేసుకుంది.