: ఈ నెల 5న ముఖ్యమంత్రికి రాష్ట్రపతి అపాయింట్ మెంట్
ఈ నెల 5న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు రాష్ట్రపతి కార్యాలయం అపాయింట్ మెంట్ ఖరారు చేసింది. అటు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాపత్రినిధులు రేపు (మంగళవారం) సాయంత్రంకల్లా ఢిల్లీ చేరుకోవాలని సమాచారం అందింది. ఈ క్రమంలో ఐదవ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎంతో సహా సీమాంధ్ర నాయకులందరూ రాష్ట్రపతితో భేటీ కానున్నారు.