: అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి: సీఎం రమేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తీరును అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ తాము చెబుతున్న సమన్యాయానికి అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకుంటామని తమతో చెబుతున్నాయని చెప్పారు. తాము కలిసిన జాతీయ పార్టీల నేతలంతా విభజన సరికాదని అభిప్రాయపడుతున్నారని ఆయన తెలిపారు.