: దావూద్ ను పట్టుకుని కోటీశ్వరులు అవ్వాలనుకుంటే.. ?


బీహార్ రాజధాని పాట్నాకు చెందిన ముగ్గురు స్కూల్ విద్యార్థులు త్వరగా కోటీశ్వరులు అవ్వాలనుకున్నారు. సెయింట్ మైఖేల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న వీరికి.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను పోలీసులకు పట్టిస్తే కోట్లు వస్తాయి కదా అన్న ఆలోచన వచ్చింది. ముగ్గురూ కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ధన సాయం కోసం జేడీయూ ఎమ్మెల్యే అనంత్ సింగ్ ను కలుద్దామనుకున్నారు. కానీ, వారి ప్రయత్నం ఫలించలేదు.

కష్టపడి కోల్ కతా వరకూ వెళ్లిన తర్వాత గానీ వారికి అర్థం కాలేదు.. తమ లక్ష్యం అసాధ్యమని. ముగ్గురిలో ఒకరైన బిపిన్ కుమార్ చెప్పిన విషయం విని పోలీసులకు దిమ్మ తిరిగిన పనైంది. దావూద్ ఇబ్రహీంను పట్టుకుని కోట్లు సంపాదించడమే తమ ధ్యేయంగా చెప్పాడు. దాంతో తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, వారిపై కన్నేసి ఉండాలని పోలీసులు సూచించారు. సీరియళ్లు, సినిమాల ప్రభావంతోనే వీరు ఈ పనికి పూనుకున్నట్లు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News