: ఢిల్లీ ప్రభుత్వాన్ని దించేందుకు మోడీ, అరుణ్ జైట్లీ కుట్ర చేస్తున్నారు: ఏఏపీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీ కుట్ర చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఢిల్లీ ఎన్నికల్లో తమ గెలుపు చూసి భయపడుతున్న బీజేపీ ఇప్పటినుంచి లోక్ సభ ఎన్నికల కోసం జాగ్రత్త పడుతోందని ఏఏపీ అధికారి ప్రతినిధి అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఏఏపీ నేతలు, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా 'టెల్-ఆల్' ప్రచారాన్ని ప్రకటించారు.