: పాలసీ కోసం వేచి చూస్తున్న మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు రిజర్వ్ బ్యాంకు పరపతి విధానం కోసం ఎదురు చూస్తున్నాయి. నేడు ఆర్ బిఐ మద్యంతర పరపతి సమీక్ష ఉన్నందున మార్కెట్లు ముందస్తుగా నిన్న కొంత నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రారంభం నుంచీ మార్కెట్లు స్వల్ప లాభాలలో కదలాడుతున్నాయి. బీఎస్ఈ 52 పాయింట్ల లాభంతో 19345 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 5847 వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్ బిఐ ప్రకటన తర్వాత మార్కెట్ డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఆర్ బీఐ కీలక వడ్డీ రేటును 0.25 శాతం వరకూ తగ్గిస్తుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి.
గెయిల్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, లుపిన్ ఒక శాతానికి పైగా లాభాలలో వుండగా, కోల్ ఇండియా 2శాతం, భెల్, టీసీఎస్, ఓఎన్ జీసీ షేర్లు ఒక శాతం వరకూ నష్టాలలో కొనసాగుతున్నాయి.