: ఉద్యమం, ఆందోళనలతో ఒత్తిడి పెంచుదాం: సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక
రాష్ట్ర విభజన ప్రక్రియ తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక స్టీరింగ్ కమిటీ హైదరాబాద్ లో భేటీ అయింది. సమైక్య ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి, ఛలో ఢిల్లీ కార్యక్రమం, రాష్ట్రంలో ఆందోళనలు చేపట్టి కేంద్ర మంత్రులు, ఎంపీలపై ఒత్తిడి పెంచి రాష్ట్ర విభజన అడ్డుకునేలా చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో 12 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఏపీఎన్జీవో నేతలు పాల్గొన్నారు.