: ముద్దాయితో మూడుముళ్ళు


పెళ్లి చేసుకోవాలంటే వరుడి బయాగ్రఫీని ఆమూలాగ్రం తిరగేసి, కాచి వడపోసి గానీ అమ్మాయిలు ముందడుగు వేయని నేటి కాలంలో ఈ చెన్నయ్ లాయరమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడండి! జీవిత ఖైదు పడిన ఓ వ్యక్తితో జీవితం పంచుకొనేందుకు సిద్ధమైంది. ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న ఆమె పేరు అరుణ. వయసు 27 సంవత్సరాలు. ఈ న్యాయవాదికి, హత్య కేసులో శిక్ష పడిన సోమసుందరానికి ఎలా లింకు కుదిరిందంటే...

వీరిద్దరూ దూరపు బంధువులు. జైల్లో ఉన్న సోమసుందరాన్ని చూసేందుకు తరచూ వచ్చే క్రమంలో ప్రేమ చిగురించింది. అతడో జీవిత ఖైదు పడిన వ్యక్తి అని, తానో లాయర్నని ఆమె మరిచిపోయింది. అదే కదా, ప్రేమ మహత్తు! ఇక ఆ మత్తులో మునిగిన ఆ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

ఈ ఉదయం చెన్నయ్ లోని ఓ కల్యాణ మండపంలో వారి వివాహం ఘనంగా జరగగా, బంధుమిత్రులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ఇక పెళ్లి కోసమని మద్రాస్ హైకోర్టు సోమసుందరానికి 10 రోజుల సెలవు మంజూరు చేసింది. కాగా, ఓ హత్య కేసులో మరికొందరితో కలిసి ముద్దాయిగా నిరూపితమైన సోమసుందరం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాడు. ప్రస్తుతమది పెండింగ్ లో ఉంది. అప్పటివరకు వీరి దాంపత్యం నడుమ కటకటాలు తప్పవేమో.. !

  • Loading...

More Telugu News