: ఈ ప్రేమ-పెళ్లి.. చాలా ‘లోతు’ గురూ!


‘ప్రేమ ఎంత మధురం!’ అని అందరూ పాడుకుంటే.. ఈ ప్రేమ జంట మాత్రం ‘ప్రేమ ఎంత లోతో’నని పాట అందుకున్నారు. అంతేనా.. తమ ప్రేమని గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కేంత మధురంగా మరీ పాడుకున్నారు. అవును, బ్యాంకాక్ దేశంలోని ఓ జంట తమ వివాహాన్ని వెరైటీగా చేసుకొని గిన్నీస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు. అందరూ భూమి మీద పెళ్లి చేసుకుంటే.. ఈ ప్రేమికులు మాత్రం నీటి లోపల.. అదీ 130 మీటర్ల లోతులో పెళ్లి చేసుకోవాలని ఫిక్సయిపోయారు.

జపాన్ కు చెందిన హిర్యోకీ యోషిడా డైవింగ్ ట్రైనర్. వృత్తిలోని తన సహచరురాలైన అమెరికాకు చెందిన సాంద్రాను జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకున్నారు. అయితే, వివాహాన్ని మాత్రం గుర్తుండిపోయేలా.. ‘వెరైటీ’గా ఉండాలని నీటిలో 130 మీటర్ల లోతులో వివాహ వేదికను సిద్ధం చేసుకున్నారు. ఈ వేదికను థాయ్ లాండ్ దేశంలోని సాంగ్ హంగ్ సరస్సులో ఏర్పాటు చేశారు. సహచరుల సమక్షంలో 190 నిమిషాల పాటు ఈ పెళ్లి తంతు జరిగింది. పెళ్లికొడుకైన యోషిడా.. పెళ్లికూతురు సాంద్రా చేతికి వజ్రపుటుంగరాన్ని తొడిగి తన ‘లోతైన’ ప్రేమను వ్యక్తపరిచారు. ఇంకేముంది.. నీటిసరస్సులో జరిగిన ఈ పెళ్లి వేడుకను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేశారు. ఏది ఏమైనా, యోషిడాది ‘రికార్డు ప్రేమ’ అని ఇప్పుడు జపాన్ వాసులు అనుకుంటున్నారు.

  • Loading...

More Telugu News