: రోహిత్, రహానే ఫిఫ్టీలు.. డ్రాగా ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్


కివీస్ పర్యటనలో విజయానికి ముఖం వాచిపోయిన టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ లోనూ గెలుపును దక్కించుకోలేకపోయింది. న్యూజిలాండ్ లెవెన్ తో రెండ్రోజుల మ్యాచ్ ను డ్రాగా ముగించింది. అయితే, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సంతృప్తి పడింది. ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ లెవెన్ 9 వికెట్లకు 262 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం భారత్ రోహిత్ (59 రిటైర్డ్), రహానే (60 రిటైర్డ్)ల అర్థ సెంచరీల సాయంతో తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 313 పరుగులు చేసింది. రాయుడు 49 పరుగులతో అజేయంగా నిలవగా, అశ్విన్ (46) సత్తా చాటాడు.

  • Loading...

More Telugu News