: విభజన అంటే గీత గీయడం కాదు: వెంకయ్యనాయుడు
రాష్ట్ర విభజన అంటే గీత గీయడం లాంటిది కాదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రకు న్యాయం చేయకుండా విభజన చేస్తామంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. రాయలసీమ తరతరాల కరవుతో అల్లాడుతున్నా పరిష్కారం చూపకుండా విభజన అంటే సరికాదని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నట్టు నాటకాలాడుతున్న కిరణ్ కుమార్ రెడ్డి సీడబ్ల్యూసీ సమావేశంలో ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.
పదేళ్లు అధికారంలో ఉండగా విభజన గురించి పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ, ఎన్నికలకు మరో రెండు నెలల ముందు విభజనను తెరమీదికి తీసుకొచ్చిందని ఆయన మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రగులుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాయలసీమకు మద్దతివ్వాలని కొంతమంది నేతలు తమను కలిసినా ఆర్థిక ఇబ్బందులు ఎదురౌతాయనే ఉద్దేశంతో తాము మద్దతివ్వలేదని ఆయన స్పష్టం చేశారు.