: విభజన ఆపాలంటూ సుప్రీంలో మరో పిటిషన్


రాష్ట్ర విభజన ఆపాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో మరో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు అడుసుమిల్లి జయప్రకాష్, ఇటీవలే బీజేపీలో చేరిన రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర శాసనసభలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానించినా.. పార్లమెంటులో పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మరోవైపు విభజన బిల్లు విషయంలో జోక్యం చేసుకోవాలని ఇప్పటికే దాఖలైన ఏడు పిటిషన్ల విచారణను సుప్రీం ఈ నెల 7కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News