: ఒత్తిడి తగ్గించుకోండి ... అల్జీమర్స్ ను తరిమేయండి!


అల్జీమర్స్ .... ఎక్కువగా వయసు పైబడుతున్న వారిలో కనిపించే వ్యాధి ఇది. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం దీని ప్రధాన లక్షణం. పరిచయస్తులు ఎదురుగా ఉన్నప్పటికీ, వారిని గుర్తుపట్టలేని స్థితి. అలాగే, కొన్ని క్షణాల క్రితమే తమ చేతిలోని వస్తువును ఎక్కడ పెట్టారో కూడా గుర్తు రాని పరిస్థితి. ఈవేళ ప్రపంచంలో ఎందోమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే, ఈ అల్జీమర్స్ కీ, ఒత్తిడికీ అవినాభావ సంబంధముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మనిషి ఒత్తిడికి గురైనప్పుడు మెదడులో విషయగ్రహణ చర్యను అడ్డుకునే అల్లోప్రెగ్ననోలోన్ అనే స్టెరాయిడ్స్ స్థాయులు అధికమవుతున్నాయట. ఇది దీర్ఘకాలం కొనసాగితే అల్జీమర్స్ వ్యాధి వచ్చే ముప్పు అధికమవుతుందని స్వీడన్ లోని ఓ విశ్వ విద్యాలయం వారు జరిపిన పరిశోధనల్లో తేలింది. అల్జీమర్స్ వ్యాధిలో మెదడు కణాలు దెబ్బతింటాయి. అందుకని ఒత్తిడిని బాగా తగ్గించుకోవాలని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు.                      

  • Loading...

More Telugu News