: బ్రహ్మాస్త్రాలు చాలా ఉన్నాయి.. విభజన జరగదు: లగడపాటి
తమ దగ్గర బ్రహ్మాస్త్రాలు చాలా ఉన్నాయని, రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి నొక్కి చెప్పారు. అవసరం వచ్చినప్పుడు చివరి బ్రహ్మాస్త్రాన్ని వాడతామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలసి రాష్ట్రపతిని కలిసి, విభజించవద్దని కోరతామని తెలిపారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు పార్లమెంటులో చర్చకు రాదని ఆయన అభిప్రాయపడ్డారు.